Stock Market Closing Bell: నిన్న ముహురత్ ట్రేడింగ్ తో ప్రారంభమైన లాభాలు ఈ రోజు మార్కెట్ల ఆరంభంలోనూ కొనసాగాయి. అయితే కేవలం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒత్తిడి కారణంగా కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ సూచీ 150 పాయింట్ల లాభంలో మెుదలైంది. నిఫ్టీ సూచీ సైతం స్వల్ప లాభంలో ప్రారంభమైంది.

మార్కెట్ ముగిసే సమయానికి..
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 288 పాయింట్లు, నిఫ్టీ సూచీ 74 పాయింట్ల నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 137 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఆటో ఇండస్ట్రీస్ రంగాలు భారీగా పెరిగాయి. ఎఫ్ఎమ్సీజీ మాత్రం 1 శాతం మేర నష్టపోయింది.

టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని టెక్ మహీంద్రా, మారుతీ, జేఎస్డబ్యూ స్టీల్, ఎల్అండ్ టీ, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రాసిమ్, బీపీసీఎల్, సిప్లా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హిందాల్కొ, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, హీరో మోటొకార్ప్ కంపెనీల షేర్లు మార్కెట్లు ముగిసే సమయంలో లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
సూచీలోని బ్రిటానియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఐటీసీ, దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాల నడుమ చివరికి టాప్ లూజర్స్ గా ముగిసాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications