Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. దుమ్ముదులిపిన పవర్, రియల్టీ స్టాక్స్..
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒత్తిడితో కూడిన వారాంతాన్ని చూశాయి. ఈ క్రమంలో కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. భారీ నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్ ముగింపు నాటికి కోలుకుంది.
మార్కెట్లు ముగిసే నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 14 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదిలా ఉండగా నిఫ్టీ బ్యాంక్ సూచీ 211 పాయింట్లను కోల్పోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 206 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

భారత మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల ప్రవాహం తగ్గింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకున్న తర్వాత దేశీయ మార్కెట్ క్షీణించింది. అలాగే జపాన్ సెంట్రల్ బ్యాంక్ కఠినమైన విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందన్న వార్తలతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.
NSEలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టిఐఎమ్, ఎల్ టి, యూపీఎల్, విప్రో, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications