Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో ముగిసిన సూచీలు..
Stock Market Crash: ఉదయం ఊగిసలాటల్లో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి తమ ప్రయాణాన్ని నష్టాల్లోనే ముగించాయి.

నష్టాల్లో సూచీలు..
స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 542 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ దాదాపు 165 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 320 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 170 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపినందున అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది.

జో బైడెన్ నిర్ణయం..
ప్రధానంగా ఇండియాతో పాటు ఆసియా మార్కెట్లను అమెరికాలో జరుగుతున్న పరిణామాలు దెబ్బతీసినట్లు తెలుస్తోంది. రేట్ల పెంపులో దూకుడు భారీగా ఉంటుందని ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రకటించారు. దీనికి తోడు అమెరికాలోని సంపన్నులపై పన్నులను పెంచే యోచనలో జో బైడెన్ ప్రభుత్వం ఉండటం, రానున్న కాలంలో ఆర్థిక లోటును భారీగా తగ్గించాలని నిర్ణయించటం వంటి కీలక అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

టాప్ గెయినర్స్..
NSEలో మార్కెట్ క్లోజింగ్ నాటికి టాటా స్టీల్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐచర్ మోటార్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, మారుతీ, బజాజా ఫైనాన్స్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, హీరో మోటార్స్, ఐటీసీ, టాటా కన్జూమర్, బ్రిటానియా, టైటాన్, ఓఎన్జీసీ కంపెనీ స్టాక్స్ మార్కెట్లు ముగిసే సమయానికి నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications