Stock Market: భారీ నష్టాల్లో ఫైనాన్స్ స్టాక్స్.. నష్టాల్లోనే ముగిసిన Sensex, Nifty..
Market Closing: రిజర్వు బ్యాంక్ ఫైనాన్స్ సంస్థల రుణాల వితరణపై ఉక్కుపాదం మోపటంతో ఈ రంగంలోని కంపెనీల షేర్లు మార్కెట్లో బేజారాయి. దీంతో కీలక సూచీలు భారీగా నష్టపోయాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 34 పాయింట్ల మేర క్షీణించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 578 పాయింట్లు కోల్పోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా పెరిగి 85 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని లాభదాయకంగా ముగించింది. మార్కెట్లు ముగిసే సమయంలో ఆటో, ఫార్మా, ఎఫ్ఎమ్సీజీ రంగాల షేర్లు లాభాలను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, ఎల్ టి, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, నెస్లే, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, మారుతీ, టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటప్ ప్రైజెస్, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, టైటాన్, ఎల్ టిఐఎణ్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications