Stock Market: నష్టాల్లో వారం ముగించిన స్టాక్ మార్కెట్లు.. లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు..
Market Closing: నిపుణుల అంచనాలను దేశీయ స్టాక్ మార్కెట్లు తలకిందులు చేస్తూ మార్కెట్ల ప్రయాణం నేడు నష్టాల్లో ముగిసింది. ప్రధానంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటం.. యూఎస్ మార్కెట్లు ఫ్లాట్ ముగింపు దీనికి కారణంగా నిలిచింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 380 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 120 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 304 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 200 పాయింట్లను కోల్పోయి వారాంతాన్ని క్షీణతలో ముగించాయి.

ఎన్ఎస్ఈలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, టైటాన్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, గ్రాసిమ్, కోల్ ఇండియా, ఎస్బీఐ, టీసీఎస్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, యూపీఎల్, టాటా కన్జూమర్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, హీరో మోటార్స్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్యూ స్టీల్, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications