Stock Market: ఈ రోజు ఉదయం లాభాలతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ముందు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో లాభాలకు బదులుగా నష్టాల్లో శెలవు పలికాయి. అమ్మకాల ఒత్తిడి పెరగటంతో సూచీలు బేర్ పంజాకు గురయ్యాయి.

నేడు సూచీలు..
మార్కెట్లు ముగింపు సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 293 పాయింట్లను కోల్పోయింది. మరో కీలక సూచీ నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోగా.. బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయాయి. అయితే అనూహ్యంగా మిడ్ క్యాప్ నిఫ్టీ సూచీ మాత్రం 158 పాయింట్ల లాభంతో 2022 ట్రేడింగ్ సంవత్సరాన్ని ముగించాయి. ఈ సమయంలో ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు, మెటల్ కంపెనీల షేర్లు మాత్రం మంచి పనితీరును కనబరిచాయి.

చివరి క్షణాల్లో..
డిసెంబర్ మాసంలో చివరి వారాన్ని గమనించినట్లయితే.. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఏకంగా 1.6 శాతం మేర లాభపడ్డాయి. అస్థిరత మధ్య 2022 క్యాలెండర్ సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున ప్రతికూల నోట్‌తో ముగిశాయి. ఈ ఏడాది బెంచ్‌మార్క్ సూచీలు ఒక్కొక్కటి 4 శాతానికి పైగా లాభపడ్డాయి. అయితే డిసెంబర్ మాసంలో మాత్రం 3.5 శాతం క్షీణించాయి.

2022 ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్లు 2022 జనవరి మాసంలో కరోనా తర్వాత లాభాలతో సానుకూలంగా ప్రారంభించాయి. అదే సమయంలో మిడ్-సెషన్‌లో ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. క్యాలెండర్ సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున మార్కెట్లు లాభాల స్వీకరణకు గురై దాదాపు అర శాతం నష్టపోయాయి.

టాప్ గెయినర్స్..
చివరి ట్రేడింగ్ రోజు నిఫ్టీ సూచీలోని బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, టైటాన్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హిందాల్కొ, టాటా మోటార్స్, విప్రో, హీరో మోటార్స్, ఎస్బీఐఎన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా చివరి రోజు ముగిశాయి.

టాప్ లూజర్స్..
చివరి రోజు ఎన్ఎస్ఈ సూచీలో ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు మాత్రం చివరి రోజు టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications