Stock Market: సూపర్ లాభాల్లో మార్కెట్ల క్లోజ్.. రేపటిపైనే ఇన్వెస్టర్ల ఆశలు.. ఆ ప్రకటన..
Market Closing: ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో ఐటీ, ఎఫ్ఎమ్సీజీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లు పుంజుకోవటంతో మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 583 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 159 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 186 పాయింట్ల లాభంలో తన ప్రయాణాన్ని ముగించింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం ఉదయం నుంచి నష్టాల్లో కొనసాగుతూ చివరికి 7 పాయింట్ల స్వల్ప లాస్ లో ప్రయాణాన్ని ముగించింది.

ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన చర్చల్లో పెంపులు ఉంటాయా లేక ఈ సారికి వడ్డీ రేట్ల పెంపుకు బ్రేక్ వేస్తారా అని మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అయితే అదుపులోకి రాని ద్రవ్యోల్బణం ఒక పక్క.. వడ్డీ రేట్ల పెంపు మరోపక్క రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ కు పెద్ద తలనొప్పిగా మారాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ క్రమంలో రేపు ఎలాంటి ప్రకటన వెలువడుతుందే దానిపై ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మార్కెట్లు ముగిసే సమయంలో ఎల్ టి, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్, సన్ ఫార్మా, టాటా కన్జూమర్, టైటాన్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా నిలిచి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.

ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, రిలయన్స్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications