Market Crash: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అమ్మకాల ఉధృతితో కుప్పకూలి..
Market Closing: ఉదయం ఫ్లాట్ ప్రారంభంలో స్వల్ప లాభాలను నమోదు చేసిన భారత మార్కెట్ సూచీలు చివరికి భారీ నష్టాల్లో ముగిశాయి. వారాంతపు, నెలవారీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ కావటంతో అన్ని రంగాలు నష్టాల్లోనే కొనసాగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 610 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 193 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 287 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 537 పాయింట్ల మేర నష్టపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకులు-పబ్లిక్ ప్రైవేట్, మెటల్స్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రా రంగాలు 1-2 శాతం మేర క్షీణించాయి.

ఎన్ఎస్ఈలో ఎల్ టి, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేయటంతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఎల్ టిఐఎమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, సిప్లా, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications