Stock Market: వారం ప్రారంభంలో సూచీల దూకుడు.. 18,000 మార్క్ దాటిన నిఫ్టీ.. మరో రెండు రోజుల్లో..
Stock Market Closing: వరుసగా మూడో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. వారం ప్రారంభంలో బెంచ్ మార్క్ సూచీ నిప్టీ 18000 పాయింట్ల మార్కును దాటాయి. ప్రధానంగా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఈ బుధవారం వస్తున్న నేపథ్యంలో మార్కెట్ల గమనం చాలా కీలకంగా మారింది. నేడు అంతర్జాతీయంగా అనేక మార్కెట్లు సైతం లాభాల్లోనే కొనసాగాయి.

సూచీల ఉత్సాహం..
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావటంతో సూచీలు మంచి లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 225 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ సూచీ 786 పాయింట్ల లాభపడగా.. బ్యాంక్ నిఫ్టీ 317 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 429 పాయింట్లు లాభపడింది. ఈ రోజు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి.

రిజర్వు బ్యాంక్ మీటింగ్..
నవంబర్ 3న భారతీయ రిజర్వు బ్యాంక్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే షెడ్యూల్ కాని ఈ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిపుణులు అంచనా ప్రకారం ఈ సారి రెపో రేటును ఆర్బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర పెంచవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు అమెరికా, భారత సెంట్రల్ బ్యాంక్స్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే దాని కోసం ఎదురుచూస్తున్నారు.

టాప్ గెయినర్స్..
NSEలో అల్ట్రాటెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్ టీ, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూపీఎల్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, దివీస్ ల్యాబ్, టెక్ మహీంద్రాతో పాటి మరి కొన్ని కంపెనీలు మార్కెట్ క్లోజింగ్ సమయంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
మార్కెట్ క్లోజింగ్ సమయంలో అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, బ్రిటానియా, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు మాత్రం ఎన్ఎస్ఈ ముగింపు సమయంలో నష్టాల్లో నిలిచి టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications