Stock Market: వారాంతంలో లాభాల్లో మార్కెట్లు.. అమెరికా, యూరప్‌లో చల్లారిన మంటలు..!
Stock Market: ఈ వారం మెుత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా, యూరప్ మార్కెట్లలో బ్యాంకింగ్ రంగం తీవ్ర అస్థిరతలకు లోనవటం భారత మార్కెట్లను ప్రభావితం చేసింది. ఎట్టకేలకు వారాంతాన్ని సూచీలు లాభాల్లో ముగించాయి.

మార్కెట్ సూచీలు..
శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి కీలక బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 335 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 465 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 94 పాయింట్ల లాభంలో క్లోజ్ అయ్యాయి. ఈరోజు మార్కెట్లు తమ ప్రయాణాన్ని లాభాల్లోనే ప్రారంభించాయి.

కీలక సపోర్ట్..
అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఏర్పడిన లిక్విడిటీ క్రంచ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సహకరించాలని పెద్ద బ్యాంకులు నిర్ణయించాయి. ఈ క్రమంలో సిటి బ్యాంక్, గోల్డ్ మాన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీ మోర్గన్ వంటి 11 ప్రఖ్యాత బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ బ్యాంకుల కన్సార్టియం దెబ్బతిన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ లో 30 బిలియన్ డాలర్లను డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో దెబ్బతిన్న ఇతర బ్యాంకులకు సహాయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రెడిట్ సూయిస్ లో సెంట్రల్ బ్యాంక్ మూలధనాన్ని అందిచటంతో ఆందోళనలు చల్లబడ్డాయి. మార్కెట్లు తిరిగి పుంజుకోవటానికి కూడా ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

టాప్ గెయినర్స్..
హెచ్సీఎస్ టెక్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, టాటా కన్జూమర్, టాటా స్టీల్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్బీఐ స్టాక్స్ లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
వారాతంలో మార్కెట్లు ముగిసే సమయానికి ఐషర్ మోటార్స్, ఎస్టీపీసీ, మారుతీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications