Markets Rally: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రయాణం మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను కొంత వెనక్కి లాగినప్పటికీ ఐటీ, మెటల్ రంగాల సహాయంతో సూచీలు లాభాల సునామీని నమోదు చేశాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1293 పాయింట్ల లాభంతో స్థిరపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 429 పాయింట్లు లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 407 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1026 పాయింట్ల లాభంతో రికార్డు ర్యాలీ మధ్య నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ నేడు రికార్డు గరిష్ఠమైన 24,861.15 పాయింట్లను నేడు ఇంట్రాడేలో తాకింది. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి. దీంతో ఈ వారాంతాన్ని బెంచ్ మార్క్ సూచీ మెగా ర్యాలీతో ముగించాయి.

ఈ క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 2 శాతం పెరగగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 1 శాతం లాభంతో తమ ప్రయాణాన్ని ముగించింది. నిఫ్టీలు భారీ లాభాలను నమోదు చేసిన షేర్లను పరిశీలిస్తే శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా ఉండగా.. ఓఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా ఊహించని రీతిలో నష్టాలను నమోదు చేశాయి. బుల్ జోరు కారణంగా ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, మీడియా రంగాకు చెందిన సూచీలు 1-3 శాతం లాభం మధ్య ప్రయాణాన్ని ముగించాయి.
బ్రోకరేజ్ కాల్స్..
- నేడు ఈక్విటీలకు సంబంధించి బ్రోకరేజ్ కాల్స్ పరిశీలిస్తే.. నోమురా బజాజ్ ఫిన్‌సర్వ్‌లో 'BUY' రేటింగ్ కొనసాగిస్తూ షేర్ టార్గెట్ ధరను రూ.1,780గా ఉంచింది.
- ఇదే క్రమంలో మరో సంస్థ యూబీఎస్ Syngene International కంపెనీ షేర్లకు తన 'BUY' రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.650గా ప్రకటించింది.
- బ్రోకరేజ్ సంస్థ మోర్గన్ స్టాన్లీ ఎయిర్ టెల్ కంపెనీ షేర్లకు equal-weight రేటింగ్ కొనసాగిస్టూ టార్గెట్ ధరను రూ.1330గా ఉంచింది.
- బ్రోకరేజ్ సంస్థ మోర్గన్ స్టాన్లీ AAVAS Financiers కంపెనీ షేర్లకు equal-weight రేటింగ్ ఉంచుతూ టార్గెట్ ధరను రూ.1,675గా ప్రకటించింది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications