Stock Market: వారం ప్రారంభంలో లాభాల పంట.. గ్రీనిష్గా సూచీలు.. అదరకొట్టిన IT స్టాక్స్..
Stock Market Closing: ఈ రోజు ఉదయం లాభాలతో మెుదలై చివరికి వారం ప్రారంభంలో బుల్ జోరుతో ముగిసింది. మెుదటి ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 60 వేల మార్కును తాకింది. ప్రధానంగా ఆసియా- పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగటం దేశీయ సూచీలను ముందుకు నడిపించాయి.

మార్కెట్ సూచీలు..
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడింది. ఇదే సమయంలో మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 103 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 158 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 309 పాయింట్ల లాభాలతో ఆ పరంపరను కొనసాగించాయి.

లాభాల్లో రంగాలు..
ఈ రోజు స్టాక్ మార్కెట్లో ప్రధానంగా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. మరీ ముఖ్యంగా ఐటీ, రియల్టీ రంగాల్లోని షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు మక్కువ చూపటం వల్ల ఈ రంగాలు మార్కెట్లను ముందుకు నడిపాయి. ఇదే సమయంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సైతం ఒక్క శాతం మేర లాభపడ్డాయి.

తగ్గిన ద్రవ్యోల్బణం..
తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్ఫేషన్ జూలైలో ఆరు నెలల కనిష్ఠానికి చేరుకుంది. అయితే అగష్టులో ఇది పెరగవచ్చని అంచనాలు చెబుతున్నాయి. రుతుపవనాలు దేశమంతటా విస్తరించకపోవటం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ పాజిటివ్ రిపోర్ట్ పెట్టుబడిదారుల్లో ఉత్సాహానికి ఒక కారణంగా నిలుస్తోంది.

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ పోర్ట్స్, టైటాన్, టెక్ మహీంద్రా, దివీల్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో కోల్ ఇండియా, శ్రీ సిమెంట్, నెస్టిల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు నష్టాల్లో ముగిసి టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications