Stock Market: పడిలేచిన మార్కెట్లు.. నెలవారీ F&O ఎక్స్‌పైరీతో అధిక ట్రేడింగ్..
Market Closing: ఉదయం స్వల్ప లాభాల మధ్య ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా భారీ ఒడిదొడుకులను నమోదు చేశాయి. ఈ క్రమంలో చివరికి లాభాలతో కీలక సూచీలు తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెన్సెక్స్ 87 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంలో నెల చివరి రోజు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, విప్రో, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్ కంపెనీలతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications