Market Closing: ఉదయం లాభాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ నేడు సరికొత్త గరిష్ఠమైన 24,635.05 పాయింట్లను తాకింది. ఇదే క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్ఠంగా నేడు 80,862.54 పాయింట్లను చేరుకుంది. ప్రధానంగా ఐటీ షేర్లలో బూమ్ మార్కెట్లకు దిక్సూచిగా నిలిచింది.
నేడు మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ సూచీ 146 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ సూచీ 85 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని కొత్తవారం తొలిరోజున ముగించింది. ఇదే క్రమంలో కొంత నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించిన నిఫ్టీ బ్యాంక్ సూచీ చివరికి 177 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 490 పాయింట్లు మేర లాభపడింది. నేడు మార్కెట్లు ముగింపు సమయానికి ప్రధానంగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ స్టాక్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, బీపీసీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, మారుతీ, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎల్‌టిఐఎమ్, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications