Stock Market: భారీ లాభాల్లో ముగిసిన Sensex-Nifty.. కుమ్మేసిన మెటల్స్, బ్యాంకింగ్ స్టాక్స్..
Market Closing: ఉదయం బుల్ జోరుతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని చివరికి భారీ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 80,000 మార్కును అందుకోగా.. నిఫ్టీ సూచీ 24,300 వద్ద స్థిరపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 545 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 163 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 921 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 439 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలో నేడు మార్కెట్లో మెటల్స్, బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా లాభపడి మార్కెట్ల పురోగతికి దోహదపడ్డాయి.

ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టీసీఎస్, టైటాన్, రిలయన్స్, టాటా మోటార్స్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్, ఎల్ టి, సిప్లా, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications