Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఉదయం నుంచి ఉల్లాసంగా సాగి చివరికి లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నేడు ఐటీ రంగం షేర్లు లాభపడగా.. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలోని కంపెనీల షేర్లు మార్కెట్లను కిందకు లాగాయి.
సాయంత్రం మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 351 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 80 పాయింట్ల మేర లాభంతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 437 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 7 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది.

ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, విప్రో, మారుతీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఎయిర్ టెల్, ఎస్బీఐ, సిప్లా, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్, ఐటీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని మార్కెట్లో ముగించాయి.


Click it and Unblock the Notifications