Stock Market: లాభాలతో దంచికొట్టిన సూచీలు.. యుద్ధంలోనూ బుల్స్ జోరు.. ఎందుకంటే..??
Closing Bell: నిన్న భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు నేడు అనూహ్యంగా పుంజుకుని లాభాల్లోకి చేరుకున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లలో డిఫెన్స్ స్టాక్స్ పెరుగుదలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల మద్ధతుతో నేడు సూచీలు సూపర్ దూకుడును కొనసాగించాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 567 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 178 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 474 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 541 పాయింట్ల మేర లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. సూచీలను గమనిస్తే రియల్టీ ఇండెక్స్ 4 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పవర్, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ 1-2 శాతం చొప్పున పెరిగాయి. ఇదే క్రమంలో బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య నేటితో యుద్ధం నాలుగో రోజుకు చేరుకోగా, సెన్సెక్స్ సోమవారం నష్టాల నుంచి పుంజుకుంది. మునుపటి సెషన్లలో అమ్మకాలను ఎదుర్కొన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఇదే క్రమంలో ఓలటాలిటీ ఇండికేటర్ ఇండియా VIX 2 శాతం క్షీణించింది. బ్యాంకులు, ఆటో స్టాక్‌లు టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. నిఫ్టీ రియల్టీ 4% పైగా ర్యాలీ చేసి క్యూ2లో బలమైన పరిశ్రమ అమ్మకాలపై కొత్త 15 సంవత్సరాల గరిష్టాన్ని తాకింది. అలాగే ఐఎమ్ఎఫ్ భారత జీడీవీ వృద్ధి అంచనాలను పెంచటం మార్కెట్లను సానుకూలంగా ముందుకు నడిపించింది.
NSEలో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎల్ టిఐఎమ్, మారుతీ కంపెనీల షేర్లు మార్కెట్లు ముగిసే సమయానికి లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications