Closing Bell: వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలను నమోదు చేస్తూ ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసిన మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. వారాంతంలో పాజిటివ్ ముగింపుతో ఇన్వెస్టర్ల సంతోషంలో ఉన్నారు.
మార్కెట్లు ముగిసే నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 481 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 135 పాయింట్ల మేర గెయిన్ అయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 366 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 305 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా ఐటీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో లాభపడగా.. ఆటో రంగంలోని కంపెనీలు మాత్రం మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి.

పేటీఎమ్ షేర్లు శుక్రవారం BSEలో 4 శాతం పెరిగి రూ.797కి చేరుకున్నాయి. ఎందుకంటే జూలైలో సగటు నెలవారీ లావాదేవీల వినియోగదారులు 19 శాతం పెరిగారని పేటీఎం షేర్లు ర్యాలీ చేశాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో షేర్ ఈరోజు 10 శాతం పెరిగి రూ.95కి చేరుకుంది. ఈరోజు ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జొమాటో రూ.2 కోట్ల లాభాన్ని ప్రకటించింది. తద్వారా వారి ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. జొమాటో నష్టాల నుంచి బయటపడి లాభాలను ఆర్జించింది. ఈ నేపథ్యంలో జొమాటో షేర్లు పెరిగాయి.
ఎన్ఎస్ఈలో సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్, టాసీఎస్, ఎల్ టిఐఎమ్, ఎల్ టి, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎస్బీఐ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, మారుతీ, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్, ఐటీసీ, టాటా కన్జూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications