Market Closing: ఉదయం నష్టాల్లో ట్రేడింగ్ మెుదలెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు తుడిచిపెట్టి చివరికి లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో సూచీల్లో హెవీ వెయిట్స్ ఉన్న స్టాక్స్ నష్టాల్లోకి జారుకోవటం ఒడిదొడుకులకు దారితీసింది.
స్టాక్ మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 43 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 148 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఇంట్రాడేలో ఆటో రంగానికి చెందిన షేర్లు లాభాల్లో కొనసాగటం మార్కెట్లను తిరిగి పుంజుకోవటంలో దోహదపడింది.

మార్కెట్ల క్లోజింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, గ్రాసిమ్, టాటా కన్జూమర్, బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, ఎన్టీపీసీ, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్యూ స్టీల్, బ్రిటానియా, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications