stock market: అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ ఆరోపణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, బ్యాంకింగ్ రంగ సంక్షోభం వంటి వివిధ కారణాల వల్ల.. భారతీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటివరకు కొంత మేర నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ తరహా ప్రతిబంధకాల నుంచి ఇప్పుడే బయటపడుతున్నట్లు ఈ వారం పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది.
దేశ ఆర్థిక స్థితిపై వెలువడిని గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో.. వరుసగా రెండో వారం ఇండియన్ మార్కెట్ సూచీలు గ్రీన్ లో ట్రేడయ్యాయి. వృద్ధిని పెంచే ఉద్దేశ్యంతో RBI సైతం వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గుచూపక పోవడం శుభపరిణామం అని చెప్పవచ్చు. గత 5 రోజుల్లోనే పెట్టుబడిదారుల సంపద 10 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఈ పరిణామాలతో విదేశీ ఇన్వెస్టర్లూ ఉత్సాహంగా ఉన్నారు.

గ్లోబల్ ట్రెండ్ ల మధ్య కొంత స్థిరత్వం తిరిగి రావడంతో విదేశీ పెట్టుబడులు కూడా స్టాక్ మార్కెట్లపై విశ్వాసాన్ని పెంచాయి. ఈ వారంలో మార్కెట్లు 2 రోజులు మూతపడినా.. మిగిలిన 3 రోజుల్లోనే BSE సెన్సెక్స్ 3.85 శాతం ఎగిసిపడింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు సహా RBI వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం దేశంలోకి విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడింది.
గరిష్ఠ స్థాయిలో ద్రవ్యోల్బణం 6.5 శాతం పొంచి ఉన్నా, వడ్డీ రేట్ల పెంపునకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్ లు లాభాలను పొందడంలో ఈ నిర్ణయం పాత్ర ఎంతో ఉంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు FY24లో GDP వృద్ధి రేటు అంచనాను RBI 6.5 శాతానికి పెంచడమూ మార్కెట్లలో ఉత్సాహానికి కారణమని చెప్పవచ్చు.
More From GoodReturns

Paskistan: పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ! చర్చలు విఫలం కావడంతో రూ. 78,000 కోట్లు గల్లంతు! ఎలాగంటే..

HDFC Bank ఫలితాలు: సోమవారం మార్కెట్ భారీగా పడిపోతుందా?

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో షేర్ మార్కెట్లో పుల్ జోష్..

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

భారత స్టాక్ మార్కెట్: ద్రవ్యోల్బణం డేటాతో భారీ కుదుపులు తప్పవా?

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

విప్రో ఫలితాల వేళ ఇన్వెస్టర్లకు భారీ షాక్ తప్పదా?

ద్రవ్యోల్బణం గణాంకాలతో నేడు స్టాక్ మార్కెట్ భారీ మలుపు?

స్టాక్ మార్కెట్ సెలవు: బుధవారం భారీ యాక్షన్ గ్యారెంటీనా?

స్టాక్ మార్కెట్లలో ఈ వారం భారీ యాక్షన్, ఇన్వెస్టర్లు సిద్ధమా?



Click it and Unblock the Notifications