Stock Market: ముహురత్ ట్రేడింగ్ లో మార్కెట్లు శుభారంభం.. అజయ్ దేవగణ్ చేతుల మీదుగా..
Muhurat Trading: ఈరోజు దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్నారు. ఇన్వెస్టర్లు దీపావళి రోజున పెట్టుబడులను శుభప్రదంగా భావిస్తారు. స్టాక్ మార్కెట్‌లో దీపావళి పండుగ నాడు ముహురత్ ట్రేడింగ్ దాదాపు 50 ఏళ్లనాటి సంప్రదాయం. ఈసారి బీఎస్ఈ ఓపెనింగ్ బెల్ ను బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రారంభించారు.
శుభారంభం..
ముహురత్ స్పెషల్ ట్రేడింగ్ సమయంలో ఆరంభంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పెరిగింది. అన్ని సెక్టార్లకు చెందిన స్టాక్స్ గ్రీన్ జోన్‌లో ఓపెన్ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 60,000 పాయింట్లకు చేరువగా, నిఫ్టీ 17700 స్థాయిని అందుకున్నాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీల్, ఐసీఐసీఐ స్టాక్స్ మార్కెట్ ఎదుగుదలకు దన్నుగా నిలిచాయి.
NSE టాప్ గెయినర్స్..
సాయంత్రం 7.07 గంటల సమయంలో నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్స్, దివీస్ ల్యాబ్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, సన్ ఫార్మా, ఎమ్ అండ్ ఎమ్, టాటా స్టీల్, యూపీఎల్ స్టాక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
NSE టాప్ లూజర్స్..
ఇదే సమయంలో హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో నిలిచాయి.

మార్కెట్ క్లోజింగ్..
మార్కెట్ క్లోజింగ్ 19:16, 24-10-2022 సమయంలో సెన్సెక్స్ సూచీ 560 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ సూచీ 162 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 578 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 168 పాయింట్లు లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications