Market Closing: ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి తిరిగి పుంజుకున్నాయి. ఇంట్రాడేలో ఐటీ కంపెనీల షేర్లు సూచీలను నష్టాల్లోకి నెట్టినప్పటికీ.. ఆటో, రియల్టీ రంగాల షేర్లల్లో నమోదైన కొనుగోళ్లు సూచీలను లాభాల్లోకి రప్పించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 191 పాయింట్ల లాభపడగా.. నిఫ్టీ సూచీ 85 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 179 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 279 పాయింట్ల మేర లాభపడ్డాయి. యాక్సెంచర్ సంచలన అంచనాల డేటా తర్వాత ఇతర రంగాల్లోని కంపెనీల్లో నమోదైన కొనుగోళ్లు నష్టాలను తడిచిపెట్టి చివరికి సూచీలను లాభాల బాటపట్టించాయని నిపుణులు తెలిపారు.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, మారుతీ, సన్ ఫార్మా, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, ఐషర్ మోటార్స్, టైటాన్, ఐటీసీ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టి, ఎయిర్ టెల్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాల్లో ముగించాయి.
ఇదే క్రమంలో ఎల్‌టిఐఎమ్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications