Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ స్టాక్స్.. కానీ..
Closing Bell: ఉదయం ఉత్సాహంగా ప్రయాణాన్ని మెుదలు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి మంచి లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు అద్భుతమైన పనితీరును కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 406 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 108 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 242 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 2 పాయింట్ల నష్టంతో ఫ్లాట్ ముగింపును నమోదు చేసింది. ఈరోజు మార్కెట్లు లాభపడటంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడిందని చెప్పుకోవాలి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఎల్ టి, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, టీసీఎస్, మారుతీ, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగించి టాప్ గెయినర్లుగా ముగిశాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, హిందాల్కొ, ఎన్టీపీసీ, సిప్లా, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, గ్రాసిమ్, ఓఎమ్జీసీ, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిసి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications