Stock Market: ఆవిరైన లాభాలు.. తొలిరోజు నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ క్లోజ్..
Market Closing: ఉదయం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా నష్టాల్లో ముగిశాయి. ఓలటాలిటీతో ఇంట్రాడేలో లాభాలు ఆవిరి కావటం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 20 పాయింట్ల మేర నష్టాలతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ 59 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 12 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టిఐఎమ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, విప్రో, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, బ్రిటానియా, సన్ ఫార్మా, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ, రిలయన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications