Market Closing: సోమవారం మంచి లాభాలతో ప్రారంభమైన భారతీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ ముగింపును చూశాయి. ఇంట్రాడేలో కీలక సూచీల లాభాలు ఆవిరి నమోదైంది. ఈ క్రమంలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్ సూచీ ఇంట్రాడేలో నిర్మలా సీతారామన్ మీటింగ్ నేపథ్యంలో లాభపడినప్పటికీ నిఫ్టీ బ్యాంక్ సూచీ చివరికి నష్టాల్లో క్లోజ్ అయ్యింది.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో క్లోజ్ కాగా, మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 149 పాయింట్ల నష్టంతో ప్రయాణాన్ని ముగించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మంచి పనితీరుతో 105 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించింది. నేడు మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. ప్రధానంగా మార్కెట్ల ఫ్లాట్ ముగింపుకు ఓలటాలికీ కారణంగా తెలుస్తోంది.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, దివీస్ ల్యాబ్, విప్రో, పవర్ గ్రిడ్, టైటాన్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా క్లోజ్ అయ్యాయి.
ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టాటా కన్జూమర్, ఎయిర్ టెల్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టి, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు నిలిచాయి.


Click it and Unblock the Notifications