Stock Market: లాభాలు హుష్‌కాకి.. సాయంత్రానికి నష్టాల్లో ముగిసిన సూచీలు..
Closing Bell: ఉదయం మంచి లాభాలతో ప్రయాణాన్ని మెుదలు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి డీలా పడటంతో లాభాలు క్షీణించాయి. ఈ క్రమంలో సూచీలు భారీగా ఒడిదొడుకులకు లోనయ్యాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో కీలక సూచీలు ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్ల నష్టాన్ని నమోదు చేయగా.. మరో కీలక సూచీ నిఫ్టీ సూచీ 10 పాయింట్లు నష్టపోయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ 130 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.2 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఈ క్రమంలో రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఎయిర్ టెల్, టాటా కన్జూమర్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, ఐటీసీ, హిందాల్కొ, బ్రిటానియా, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టిఐఎమ్, ఎల్ టి, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎల్, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications