Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రోజంతా ఒడిదొడుకుల్లో కొనసాగి చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.414.46 ట్రిలియన్లుగా ఉంది. 2023 నవంబరులో 4 ట్రిలియన్ డాలర్ల మార్కు అందుకున్న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ నేడు మరో మైలురాయిని అందుకుంది.
ఈ క్రమంలో ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపు నాటికి నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్ ముగింపును చూశాయి. దీంతో సెన్సెక్స్ సూచీ 53 పాయింట్లు నష్టాన్ని నమోదు చేయగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 151 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 199 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో మెటల్ స్టాక్స్ ఉత్తమ పనితీరును కనబరిచాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, కోల్ ఇండియా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, సిప్లా, దివీస్ ల్యాబ్, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో నెస్లే, హీరో మోటార్స్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నేడు టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications