Closing Bell: ఉదయం లాభాల ఉత్సాహంతో ఉవ్విళ్లూరిన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి సప్పబడ్డాయి. దీంతో కీలక సూచీలు ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం భారీగా 263 పాయింట్లను కోల్పోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 283 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది.

ప్రధానంగా నేడు మార్కెట్లో రియల్టీ రంగంలోని షేర్లు లాభపడగా.. బ్యాంకింగ్ రంగంలోని షేర్లు మాత్రం సూచీలను కిందకు లాగాయి. మార్కెట్లలో నెలకొన్న ఓలటాలిటీ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
NSEలో జియో ఫైనాన్సియల్ సర్వీసెస్, టాటా స్టీల్, మారుతీ, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఎల్ టిఐఎమ్, బ్రిటానియా, సిప్లా, టీసీఎస్, సన్ ఫార్మా, నెస్లే, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, విప్రో, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications