Stock Market: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. కాపాడిన ఐటీ స్టాక్స్..
Market Closing: ఉదయం మంచి ఊపు మీద ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు కొద్ది సేపటికే లాభాల క్షీణతకు గురయ్యాయి. ఈ క్రమంలో ఐటీ షేర్లు లాభాలను అందించి దన్నుగా నిలవగా.. రియల్టీ షేర్లు మార్కెట్లను డ్రాగ్ చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ కేవలం 3 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణం ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 45 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 688 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ ముగించింది.

ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్‌టిఐఎమ్, టీసీఎల్, మారుతీ, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, టైటాన్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, సిప్లా, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందాల్కొ, టాటా మోటార్స్, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications