Stock Market: ఉదయం ఒడిదొడుకుల్లో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్ప లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ట్రేడింగ్ సమయంలో చివరి కొన్ని నిమిషాలు మార్కెట్లు భారీగా ఒత్తిడికి లోనయ్యాయి.
మార్కెట్ ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో క్లోజ్ అయ్యింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 42 పాయింట్ల లాభంలో ఉంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 29 పాయింట్ల నష్టంతో తన ప్రయాణాన్ని నేడు ముగించింది. ఈ క్రమంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, పవర్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగాయి.

NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ టి, సిప్లా, రిలయన్స్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలోని హెచ్డీఎఫ్సీ లైఫ్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, నెస్లే, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా ట్రేడింగ్ ముగించాయి.


Click it and Unblock the Notifications