Stock Market: పడి లేచిన స్టాక్ మార్కెట్లు.. అంతా IT షేర్ల మహిమ..!!
Closing Bell: ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు చివరికి అత్యంత స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో భారీ నష్టాలకు లోనైన సూచీలు చివరికి తేరుకున్నాయి.
స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 5 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 63 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 21 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా ఐటీ రంగం షేర్లు నష్టపోవటం సూచీలను నష్టాల్లోకి నెట్టింది.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, దివీస్ ల్యాబ్స్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, మారుతీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, టైటాన్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్, హిందాల్కొ, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, టాటా స్టీల్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications