Stock Market: నిండా ముంచిన మిడ్ క్యాప్ సూచీ.. ఒడిదొడుకుల్లో ముగిసిన మార్కెట్లు..
Closing Bell: ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే తిరిగి పుంజుకున్నప్పటికీ ఒడిదొడుకుల మధ్య సెన్సెక్స్ మినహా.. మిగిలిన సూచీలు నష్టాలను చవిచూశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో మిగిలిన సూచీలను గమనిస్తే.. నిఫ్టీ 3 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 59 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1,274 పాయింట్ల మేర నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల్లో నిలిచాయి.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, ఎల్ టి, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, నెస్లే, గ్రాసిమ్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా కన్జూమర్, బ్రిటానియా, విప్రో, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ట్రేడింగ్ ముగించాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, యూపీఎల్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్ కంపెనీ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications