Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆరు రోజుల్లో కీలక సూచీ సెన్సెక్స్ ఏకంగా 3280 పాయింట్లను కోల్పోయింది.
ఈరోజు దలాల్ స్ట్రీట్ పూర్తిగా బేర్స్ చేతిలోకి జారిపోయింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 901 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ బ్యాంక్ 552 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 448 పాయింట్ల మేర నష్టాలతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. నేడు మార్కెట్లు ఎక్స్ పెయిరీ కావటంతో మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. అయితే పవర్ స్టాక్స్ మాత్రం లాభపడ్డాయి.

NSEలో యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎల్ టి, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టీసీఎస్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
భారతీయ ఈక్విటీల నేటి దుర్భర పనితీరు కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ తుడిచిపెట్టుకు పోయింది. అలాగే అన్ని బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాప్ ఈ నెలలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల వరకు హరించుకుపోయింది. గడచిన 10 ఏళ్లలో నిఫ్టీ బుల్స్‌కు అక్టోబర్ నెల ఉత్తమ నెలల్లో ఒకటిగా నిరూపించబడింది. కానీ ఈ ఏడాది పనితీరు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications