Stock Market: ఆగని మార్కెట్ పరుగులు.. భారీ లాభాల్లో ముగిసిన Nifty, Sensex..
Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు తర్వాత పుంజుకున్నాయి. ఐటీ, ఫైనాన్స్ రంగం షేర్ల పనితీరుతో మార్కెట్లు ముందుకు సాగాయి.
ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 529 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 147 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 630 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 112 పాయింట్ల మేర లాభపడ్డాయి. నిపుణులు మార్కెట్ ర్యాలీ ముగుస్తుందని భావించినప్పటికీ క్యూ-1 ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు కొత్త శిఖరాలకు ఎగబాకుతూనే ఉన్నాయి.

ఈరోజు ఆటో మినహా అన్ని రంగాలు గ్రీన్ మార్క్‌లో ట్రేడింగ్ ముగించాయి. ఇన్వెస్టర్ల సంపద 303.59 లక్షల కోట్లకు పెరిగింది. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం నాడు ఇన్వెస్టర్ల సంపద రూ.298.57 లక్షల కోట్లుగా ఉంది. బుల్ రన్ కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద 5 లక్షల కోట్లు పెరగటం గమనార్హం.
స్టాక్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణాలను పరిశీలిస్తే..
- ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
- డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరగటం
- విదేశీ పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్ల ప్రవాహం కొనసాగటం
- US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును పాజ్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు
- ఇన్వెస్టర్లు హెవీవెయిట్ స్టాక్స్‌లో పెట్టుబడులను కొనసాగించారు
మార్కెట్లు ముగిసే సమయంలో ఎస్బీఐ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, ఎల్ టిఐఎన్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, హీరో మోటార్స్, టాటా మోటార్స్, టైటాన్, ఎయిర్ టెల్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, హిందాల్కొ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications