Closing Bell: ఉదయం మెుదటి ట్రేడింగ్ సెషన్లో ఒడిదొడుకుల మధ్య ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగించిన మార్కెట్లు చివరికి భారీ లాభాల్లో ట్రేడింగ్ ముగించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 78674 స్థాయి వద్ద స్థిరపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 148 పాయింట్లు ఎగబాకి 23869 పాయింట్ల స్థాయి వద్ద క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 265 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 123 పాయింట్లను కోల్పోయింది. ప్రధానంగా నేడు బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు మార్కెట్లను ముందుకు నడపటంతో దోహదపడ్డాయి.

ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రామిస్, బ్రిటానియా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, కోటక్ బ్యాంక్, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, మారుతీ, ఎల్ టి, టీసీఎస్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, టాటా స్టీల్, హిందాల్కొ, సిప్లా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications