Market Opening: ఊపిరి పీల్చుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అసలు ఏం మారింది..?
Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు నిన్న భారీ పతనాన్ని నమోదు చేశాయి. అయితే నేడు బెంచ్ మార్క్ సూచీలు తిరిగి తేరుకున్నాయి. ఈ క్రమంలో టోక్యో స్టాక్ మార్కెట్లు రికార్డు పతనం తర్వాత 10 శాతం తిరిగి పుంజుకున్నాయి. US ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, బలమైన యెన్‌పై మునుపటి రోజు రికార్డ్ సెల్‌ఆఫ్ నుంచి తిరిగి బౌన్స్ అయింది.
ఈ క్రమంలో ఉదయం 9.32 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 880 పాయింట్లు లాభంలో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 263 పాయింట్లు పెరుగుదలను చూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 395 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 837 పాయింట్ల వృద్ధితో ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలో సోమవారం యూఎస్ మార్కెట్ల సూచీ నాస్‌డాక్, ఎస్అండ్ పి 500.. 3 శాతం మేర పతనాన్ని చూశాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో పాటు, వారెన్ బఫెట్ యాపిల్ స్టాక్స్ విక్రయం తర్వాత కొనసాగిన అమ్మకాలు అక్కడి మార్కెట్లను కుప్పకూల్చాయి.
ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, ఎల్ టి, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, గ్రాసిమ్, హిందాల్కొ, బ్రిటానియా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. అలాగే ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో టాప్ లూజర్స్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications