Stock Market: మార్కెట్లోకి తిరిగొచ్చిన బుల్స్.. యూఎస్ మార్కెట్ల జోరుతో ముందుకు..
Market Recovery: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో భారీగా నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు తిరిగి నేడు పుంజుకున్నాయి.
వాస్తవానికి నిన్న అమెరికా మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీలు మంచి లాభాల్లో ముగియటంతో ఆ సెంటిమెంట్లు దేశీయ ఇన్వెస్టర్లను సానుకూలంగా మార్చాయి. రానున్న కాలంలో ఏఐ వినియోగంపై ఉన్న సానుకూలతల మధ్య యూఎస్ మార్కెట్లలో జోష్ కనిపించింది. ఈ క్రమంలో ప్రధానంగా చిప్ తయారీ రంగంలో ఉన్న కంపెనీలు సైతం లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నిరుత్సాహకర పనితీరు ప్రభావంతో 11% పడిపోవటం వంటి కారణాల వల్ల నిఫ్టీ మూడు రోజులుగా నష్టాలను నమోదు చేసింది.

మార్కెట్లు ప్రారంభం తర్వాత ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 560 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 161 పాయింట్ల మేర లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 344 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 364 పాయింట్ల మేర లాభాలతో బుల్ జోరును కొనసాగిస్తున్నాయి.
ఎన్ఎస్ఈలో టెక్ మహీంద్రా, విప్రో, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్ బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముందుకు సాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో కేవలం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ మాత్రమే నష్టాలతో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications