Indian Market Opening: ఈవారం ప్రారంభంలో మెుదటి రోజు స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చాయి. అయితే నేడు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతల మధ్య దేశీయ సూచీలు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 123 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 176 పాయింట్ల లాభాలతో నేడు ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల సానుకూలతలు దీనికి కలిసొచ్చాయని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో మిడ్ క్యాప్ కంపెనీలు ప్రధానంగా ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ప్రధానంగా యూఎస్ బాండ్ ఈల్డ్స్ వెనక్కి తగ్గటం ఈక్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకోవటానికి కారణంగా నిలిచింది. ఇది మార్కెట్లలో ఆందోళనలను తగ్గిస్తోంది. ప్రధానంగా గిఫ్ట్ నిఫ్టీ, మార్కెట్ల ప్రీఓపెనింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగటం ఆందోళనలు కలిగించినప్పటికీ మార్కెట్లు నేడు శుభారంభాన్ని నమోదు చేశాయి. వరుసగా నాలుగు సెషన్లలో దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూడటం, కీలక సూచీలు సపోర్ట్ లెవెల్స్ వద్దకు చేరుకోవటం ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురిచేసింది.
NSEలో హిందాల్కొ, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టిఐఎమ్, టాటా కన్జూమర్, విప్రో, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా, బీపీసీఎల్, ఎస్బీఐ, యూపీఎల్, హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications