Blood Bath: మోదీని నమ్ముకుని నష్టపోయిన ఇన్వెస్టర్లు.. అదానీకి పెద్ద నష్టం..!!
Markets Crash: మార్కెట్లు ముందు నుంచి ఊహించినట్లుగానే నేడు ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో ఎగ్జిట్ పోల్స్ నమ్మి పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సర్వం మోదీ మయం అన్నట్లుగా వచ్చిన ఫలితాలతో నేడు ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టాన్ని చవిచూస్తున్నారు.
మార్కెట్ల అస్థిరత సూచీ ఇండియా విక్స్ ఏకంగా ఇంట్రాడేలో 39 శాతం పెరిగింది. ఇండియా కూటమి బలంగా దూసుకురావటం మార్కెట్లను ఒక్కసారిగా తారుమారు చేశాయి. దీంతో భారీ అమ్మకాల ఒత్తిడి నేడు మార్కెట్లలో కొనసాగుతోంది. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ నేడు ఇంట్రాడేలో ఏకంగా రూ.23 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఇన్వస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో అన్ని అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ క్షీణత కొనసాగుతోంది.

ఇదే క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ గడచిన రెండేళ్లలో ఒకే రోజులో అత్యంత దారుణమైన పతనాన్ని ప్రస్తుతం చూసింది. ఇదే క్రమంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 5 శాతం తగ్గాయి. పీఎస్‌యూ బ్యాంక్ 10 శాతం క్షీణించడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో 11.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 1015 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 3155 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 2864 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 3193 పాయింట్లను కోల్పోయింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను కొనసాగిస్తున్న వేళ.. డిఫెన్స్ స్టాక్స్ 15% క్షీణతను చూస్తున్నాయి. ప్రధానంగా భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, మజాగాన్ డాక్ దారుణంగా దెబ్బతిన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ థీమ్ కింద రక్షణ తయారీ స్వదేశీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వ హయాంలో డిఫెన్స్ స్టాక్స్ ఈ సీజన్‌లో మరింత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications