Stock Market: తిరిగి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు.. అమెరికా మార్కెట్ల దారిలో ప్రయాణం..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. ఈరోజు అమెరికా మార్కెట్ల జోష్ అందిపుచ్చుకుని లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 167 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 134 పాయింట్లు లాభపడింది. గడచిన ఆరేళ్లలో నిన్న అమెరికా మార్కెట్లు భారీగా ఇంట్రాడేలో లాభపడటం ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హీరో మోటార్స్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, బ్రిటానియా, నెస్లే, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే క్రమంలో ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, టాటా స్టీల్, రిలయన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications