Market Opening: కొత్త వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో ప్రారంభించాయి. ఈ క్రమంలో కీలక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి.
ఉదయం 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ 59 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ సూచీ 9 పాయింట్ల స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 131 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 100 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతోంది.

వాస్తవానికి సీఎల్ఎస్ఏ తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల టార్గెట్ ధరను డౌన్ గ్రేడ్ చేయటంతో షేర్లు నేటి ఉదయం ఆరంభం ట్రేడింగ్ సెషన్లోనే నష్టాల బాట పట్టాయి. ఒక్కో షేర్ టార్గెట్ ధరను రూ.1,650కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు కొంత ఆందోళనకు గురవుతున్నారు.
ఎన్ఎస్ఈలో సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, బీపీసీఎల్, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎయిర్ టెల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, ఎస్బీఐ లైఫ్, ఐటీసీ, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే క్రమంలో టాటా కన్జూమర్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎల్ టి, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్డబ్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications