Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఆ రెండు రంగాలపై ఇన్వెస్టర్ల ఫోకస్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తమ ప్రయాణాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపిస్తున్నప్పటికీ.. భారత మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతోనే తమ ప్రయాణాన్ని ఆరంభించాయి.
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 13 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 49 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ లాభాల పరంపర జోరు ఆరంభం నుంచి క్రమంగా తగ్గుతోంది.

మార్కెట్లలో ఈరోజు ప్రధానంగా గ్యాస్, ఆటో రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు కన్నేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీఎన్జీ, పీఎన్జీ ధరలకు కొత్త ధరల సూత్రాన్ని తీసుకురావటంతో ఆ రంగంలోని కంపెనీలు తమ రేట్లను భారీగా తగ్గించాయి. దీంతో గ్యాస్ స్టాక్స్ మార్కెట్లో మెుమెంటం కలిగి ఉన్నాయి. దీనికి తోడు ఆర్థిక పరిస్థితుల కారణంగా దేశంలో కార్ల విక్రయాల డిమాండ్ ప్రభావితం అవుతున్నందున ఆటో స్టాక్స్‌పై ప్రభావం కనిపిస్తోంది.
NSE సూచీలో టాటా మోటార్స్, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, యూపీఎల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, బీపీసీఎల్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
ఇదే క్రమంలో ఏషియన్ పెయింట్స్, మారుతీ, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, హెచ్డీఎఫ్సీ, టాటా కన్జూమర్, హీరో మోటార్స్, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి


Click it and Unblock the Notifications