Market Next Week: ఈవారం మార్కెట్లతో జాగ్రత్త ఇన్వెస్టర్స్.. దిశా నిర్థేశం చేసే అంశాలివే..!!
Stock Market News: గతవారం భారీ ఒడిదొడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు రానున్న వారం కోసం సిద్ధమౌతున్నాయి. అయితే ఈ క్రమంలో అనేక కీలక అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి.
అన్నింటి కంటే ముఖ్యంగా ఈవారం భారత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల దృష్టి హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికపైనే ఉంది. మార్కెట్ రెగ్యులేటర్ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్‌పై చేసిన ఆరోపణలు మార్కెట్ సెంటిమెంట్‌పై నీలినీడలు కమ్మే అవకాశం ఉంది. తాజా సంచలన నివేదికలో బుచ్ గతంలో అదానీ గ్రూప్ ద్వారా ఉపయోగించబడిన ఆఫ్‌షోర్ ఫండ్‌లలో పెట్టుబడులను కలిగి ఉన్నట్లు షార్ట్ సెల్లర్ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి పేర్కొంటూ పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే ప్రయత్నంగా సెబీ చీఫ్ పేర్కొన్నారు.

దీనికి తోడు రానున్న వారంలో ఐపీవోలతో సైతం దలాల్ స్ట్రీట్ బిజీగా గడపనుంది. ఈ క్రమంలో 5 కొత్త ఐపీవోల జాబితాలతో పాటు తొమ్మిది ఎస్ఎమ్ఈ ఐపీవోల ఐపీవో ప్రక్రియను ప్రారంభించనున్నాయి. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లలో గమనించాల్సిన విషయాల్లో చైనా వడ్డీ రేట్లతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ క్రమంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గత నెలలో తన కీలక రేటును అనూహ్యంగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ ఎత్తుగడలపై విశ్లేషకులకు ఊహాగానాలు మిగిల్చింది. ఇక దేశీయంగా విడుదల కానున్న భారతదేశ వినియోగదారుల ధరల సూచిక, టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం గణాంకాల కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి.
ఇదే క్రమంలో క్యూ 1 ఫలితాలను ప్రకటించనున్న కార్పొరేట్ దిగ్గజాల్లో ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, నజారా టెక్నాలజీస్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హీరో మోటర్‌కార్ప్ లిమిటెడ్, హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ వంటి ఇండస్ట్రీ లీడర్‌లు రిపోర్ట్ చేయనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు కొన్ని కార్పొరేట్ చర్యలపై ట్రేడర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications