Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దెబ్బతీసిన స్టాక్స్ ఇవే..
Closing Bell: ఉదయం ఉత్సాహంగా లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అలా ఒత్తిడికి గురైన సూచీలు ఎట్టకేలకు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ సూచీ 65 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ సూచీ 6 పాయింట్ల లాభంలో క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 115 పాయింట్ల లాభాలతో ముగియగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 8 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని నేడు ముగించింది.

మార్కెట్ల పయనాన్ని గమనించినట్లయితే ప్రధానంగా ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లోకి జారుకోవటం సూచీలను కిందకు లాగేసింది. ఇదే సమయంలో పవర్ కంపెనీల షేర్లు మాత్రం లాభపడ్డాయి. ఇదే సమయంలో భారత రూపాయి డాలర్ పై 8 పైసలు లాభపడి 82.15 వద్ద ట్రేడింగ్ ముగించింది. మార్కెట్లలో ఇన్వెస్టర్లు ప్రధానంగా వివిధ కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలపై దృష్టి సారించటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరీ ముఖ్యం ఐటి రంగంపై పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారు.
ఇదే సమయంలో మరోసారి అమెరికా ఫెడ్ రేటు పెంపుకు ఉపక్రమిస్తుందని వార్తలు వస్తున్న వేళ భారత మార్కెట్లకు గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లేకుండా పోయింది. అలాగే ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉపసంహరణ మార్కెట్ ట్రెండ్‌కు ఆటంకం కలిగించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. భారత సెంట్రల్ బ్యాంక్ సైతం ఈ సారి ఎంపీసీ సమావేశంలో చివరిసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications