Stock Market: ఆచితూచి అడుగేస్తున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాల్లో మార్కెట్ల ప్రారంభం.. RBI సమావేశం..

Stock Market Opening Bell: నిన్న సానుకూల పవనాల మధ్య పాజిటివ్ గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం వరకు ఆ జోష్ ను కొనసాగించాయి. అయితే రెండవ ట్రేడింగ్ సెషన్ లో అమ్మకాల వత్తిడి సూచీలను కిందకు లాగేసింది.

ఈ రోజు మార్కెట్లు ఇలా..

ఈ రోజు మార్కెట్లు ఇలా..

సానుకూల గ్లోబల్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII), తటస్థ దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) సెంటిమెంట్ల మధ్య ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభిచే అవకాశం ఉంది. దీనికి తోడు రిజర్వు బ్యాంక్ ద్రవ్యపరపతి సమీక్ష కొనసాగుతున్నందున నేడు రేట్ల పెంపు ఉండవచ్చు. ఇన్వెస్టర్లు దీనిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రారంభం..

ప్రారంభం..

దేశాయ బెంచ్ మార్క్ సూచీలు నిన్న నష్టాల్లో ముగిసినప్పటికీ నేటి ఆరంభ ట్రేడింగ్ సెషన్ లో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 133 పాయింట్లు, మరీ కీలక సూచీ నిఫ్టీ-50.. 31 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 124 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 23 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి.

ఈ రోజు గమనించవలసి స్టాక్స్..

ఈ రోజు గమనించవలసి స్టాక్స్..

ఈ రోజు ప్రధానంగా మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, అదానీ పోర్ట్స్ కంపెనీలు వార్తల్లో ఉన్నాయి. అయితే వీటికి తోడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుజరాత్ స్టేట్ పెట్రోల్, బీఈఎమ్ఎల్, వేలియంట్ ఆర్గానిక్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్లెన్ మార్క్, ఆర్ఈసీ, దాల్మియా భారత్, అలంబిక్ ఫార్మా, బాలకృష్ణా ఇండస్ట్రీస్, బేయర్, ఉజ్జీవన్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ వివిధ కారణాల వల్ల వార్తల్లో నిలిచాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+