Market Opening: వరుస ట్రేడింగ్ సెషన్లలో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. నిన్న నష్టాల నుంచి తేరుకుని ఫ్లాట్ ముగింపును నమోదు చేసినప్పటికీ నేడు పరిస్థితు ఓలటాలిటీ, ఎన్నికల ట్రేడింగ్ కారణంగా మళ్లీ మెుదటికి వచ్చింది.
ఉదయం 9.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 45 పాయింట్ల మేర నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్ల లాభంతో నేడు ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 86 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. మార్కెట్లు ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్ది నష్టాలోను పెంచుకుంటున్నాయి.

NSEలో హీరో మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, టైటాన్, మారుతీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఎల్ టి, దివీస్ ల్యాబ్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, నెస్లే, టాటా కన్జూమర్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, రిలయన్స్, ఓఎన్డీసీ, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నేడు మార్కెట్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications