Market Next Week: అనేక వారాలుగా బుల్ ర్యాలీని కొనసాగించిన తర్వాత గడచిన శుక్రవారం దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో కుప్పకూలాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు రానున్న వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయి. ఏఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఆందోళనలో ఉన్నారు. ముందుగా వచ్చే వారం దాదాపు 380 కంపెనీలు తమ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇవి మార్కెట్లపై ప్రభావితం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

గతవారం మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేక పోయాయి. ఈవారం దేశీయ మార్కెట్లలో రిలయన్స్ అమ్మకాల ఒత్తిడిని కలిగించొచ్చని.. ఇన్ఫోసిస్ షేర్ మాదిరిగా మార్కెట్లను నష్టాల్లోకి లాగొచ్చని అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అయితే మరోపక్క బ్యాంకింగ్ కంపెనీలు మంచి లాభాల పరంపరను త్రైమాసిక ఫలితాల్లో కొనసాగిస్తున్నాయి.
వచ్చే వారం జూలై 26న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు సూచీలు సూచిస్తున్న వేళ రేట్ల పెంపు ఉంటుందా లేక స్థిరంగా బ్రేక్ కొనసాగిస్తుందా అని ఆసియా మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. అయితే నిపుణుల అంచనా ప్రకారం యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని తెలుస్తోంది. ఫెడ్ అధికారులు సైతం ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణంపై పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నందున రేట్ల తగ్గింపు ఈ సారికి ఉండదని సంకేతాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో భారత మార్కెట్లలోకి ఎఫ్ఐఐలు తమ డబ్బును ఈక్విటీల్లో కుమ్మరిస్తున్నారు. జూలై నెలలో వారు ఏకంగా రూ.17,700 కోట్లను ఇండియా మార్కెట్లలోకి తరలించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపుతూ అమ్మకాలకు దిగుతున్నారు. అలాగే అనేక ఐపీవోలు సైతం మార్కెట్లోకి అడుగుపెడుతూ సందడి చేస్తున్నాయి. మెుత్తానికి ఈవారం ఇన్వెస్టర్లు కొంత జాగ్రత్తగానే వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications