Stock Market: భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఎన్నడూ చూడని వేగంతో తమ జీవితకాల గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు సెన్సెక్స్ సూచీ 63583 సరికొత్త రికార్డు గరిష్ఠాన్ని తాకింది. అయితే చైనాలో పెరుగుతున్న నిరసనలు, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ వైఖరి వంటి కీలక విషయాలు దీనికి దోహదపడుతున్నాయి.

ప్రపంచానికి భిన్నంగా..
ప్రస్తుత ప్రపంచ అస్థిరతల్లో చాలా మంది విదేశీ మదుపరులు భారత మార్కెట్లపై నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగటం భారత మార్కెట్లకు కలిసొస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. అందుకే అమెరికాతో పాటు మరికొన్ని వృద్ధిచెందిన మార్కెట్లలో పతనం కొనసాగుతున్నప్పటికీ మన మార్కెట్లు మాత్రం బుల్ జోరును కొనసాగిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

క్లోజింగ్ సమయానికి సూచీలు..
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 54 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ సూచీ 29 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 246 పాయింట్ల లాభంలో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 63284 పాయింట్ల వద్ద ఉంది.

టాప్ గెయినర్స్..
మార్కెట్ క్లోజింగ్ సమయంలో సెన్సెక్స్ సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కొ, టాటా స్టీల్, గ్రాసిమ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, హీరో మోటొకార్ప్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో నిలుస్తూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
మార్కెట్ ముగిసే సమయానికి యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications