Stock Market: బేర్ మంటున్న భారత స్టాక్ మార్కెట్లు.. వారం ప్రారంభంలోనే నష్టాలు..
Stock Market Opening Bell: కొంత కాలంగా బలమైన బుల్ జోరు కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు తగ్గటం, రూపాయి విలువ పుంజుకోక పోవటం, ఈ వారం ఫెడ్ నుంచి కొన్ని ఆర్థిక గణాంకాలు వెలువడటం వంటి అంశాల దృష్ట్యా మార్కెట్ సూచీలు ఈ వారం ప్రారంభంలో నెగటివ్ వోట్ లో ప్రారంభమయ్యాయి.

నష్టాల్లో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు ఓపెనింగ్ బెల్ మోగగానే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో కీలక బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ-50 కూడా 167 పాయింట్లు నష్టపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 598 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 355 పాయింట్లను కోల్పోయాయి. మార్కెట్లు చాలా ఓలటాలిటీని ఎదుర్కొంటున్నాయి.

సావరిన్ గోల్డ్ బాండ్స్..
నేడు గమనించదగిన మరో విషయం ఏమిటంటే.. సావరిన్ గోల్డ్ బాండ్స్ ఈ రోజు నుంచి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. గ్రాముకు రూ.5,197 రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రూపంలో బంగారం కొనేవారికి గ్రాముకు రూ.50 తగ్గింపు ప్రస్తుతం అందుబాటులో ఉంది.

టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఎన్టీపీసీ, టైటాన్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు ఆరంభంలో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇదే సమయంలో అపోలో హాస్పిటల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, యూపీఎల్, గ్రాసిమ్ కంపెనీ షేర్లు ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications