Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ ప్రారంభ సమయంలో సెన్సెక్స్ సూచీ దాదాపు 200 పాయింట్ల నష్టంతో మెుదలైంది. అయితే కొద్ది సేపట్లోనే కోలుకున్న కీలక సూచీలు స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 18500 మార్క్ కింద తన ప్రయాణాన్ని ఆరంభంలో ప్రారంభించింది.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 78 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 18 పాయింట్ల లాభంలో ఉంది. మరో పక్క బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 38 పాయింట్ల నష్టంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 186 పాయింట్ల లాభంలో ఉంది.

ఈ క్రమంలో హీరో మోటొకార్ప్, బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు టాప్ గెయినర్స్ గా ఎన్ఎస్ఈలో నిలిచాయి. కాగా.. హిందాల్కొ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఈరోజు మార్కెట్లో ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ ఆయిల్, హీరో మోటొకార్ప్ షేర్లు వార్తల్లో నిలవగా ఫోకస్ లో ఉన్నాయి. ఇదే క్రమంలో ధర్మజ్ క్రాప్ గార్డ్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో ఈరోజు ప్రారంభమైంది. ఐపీవో నవంబర్ 30, 2022న ముగుస్తుంది. ఈ ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.216 నుంచి రూ.237గా కంపెనీ నిర్ణయించింది. ఐపీవో ధరతో పాటు కంపెనీ భవిష్యత్తు వృద్ధిపై మార్కెట్ అనలిస్టులు పాజిటివ్ గా ఉన్నారు.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications